Monday, 26 August 2013
Saturday, 24 August 2013
Tuesday, 20 August 2013
Monday, 12 August 2013
CAREERS@VLSI
వినూత్న కెరీర్కు.. వీఎల్ఎస్ఐ డిజైనింగ్
డెస్క్టాప్ నుంచి ల్యాప్టాప్..
నోట్ప్యాడ్ టు ట్యాబ్లెట్ పీసీ.. మొబైల్ టు మిస్సైల్.. ప్రతిదీ ఇప్పుడు మానవ పురోగతికి అత్యవసరమే! ఇవి సమర్థంగా పని చేయాలంటే.. మన అవసరాలను తీర్చేవిధంగా ఉండాలంటే.. ముఖ్యమైన పరికరం ‘చిప్’!! ఈ చిప్ తయారీ సాధారణ విషయమేమీ కాదు. దీని డిజైనింగ్కు ఎంతో శ్రమ, వ్యూహం, తుదిగా వినియోగదారుడికి ఉపయోగపడేలా రూపొందించడం వంటి ఎన్నో ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. ఈ క్రమంలో చిప్ డిజైనింగ్కు సంబంధించి శిక్షణనందించే కోర్సు.. వీఎల్ఎస్ఐ(వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్)
డిజైనింగ్.
అవకాశాలు అనేకం
వీఎల్ఎస్ఐలో సర్టిఫైడ్ ప్రొఫెషనర్ల అవసరం విషయంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో సర్టిఫికేషన్ పొందిన వారికి అవకాశాలు పుష్కలం. వృత్తిరీత్యా వీఎల్ఎస్ఐ ఇంజనీర్లుగా వ్యవహరించే వీరికి.. డిజైన్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్, ప్యాకేజింగ్ ఇంజనీర్, క్యాడ్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్ లేదా టెస్ట్ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. బీటెక్ లేదా పీజీ స్థాయిలో వీఎల్ఎస్ఐ అర్హతతో కంపెనీల్లో అడుగుపెట్టిన తాజా గ్రాడ్యుయేట్లకు ప్రారంభంలో రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. నాలుగైదేళ్ల అనుభవం ఆధారంగా సగటున రూ. 6 లక్షల వార్షిక వేతనం సొంతం చేసుకోవచ్చు.
COMPANIES
|

